
హైదరాబాద్: దగ్గుబాటి యువ హీరో రాణా ప్రస్తుతం చేతినిండా
ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రాణా చేతిలో ఏడు
ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఆయన చేస్తున్న ప్రాజెక్టుల్లో పెద్ద
ప్రాజెక్టు అంటే మాత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బహుబలి'. ఈ
చిత్రం కారణంగా రాణా ఈ సంవత్సరంతో పాటు, వచ్చే ఏడాది కూడా బిజీబిజీగా
గడపబోతున్నాడు.
ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాణా మాట్లాడుతూ... ‘ప్రస్తుతం
ఏడు సినిమా ప్రాజెక్టులు వరుసలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి
దర్శకత్వంలో రూపొందుతున్న బహుబలి చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టాను. ఇదో
భారీ పోరాటాల చిత్రం. ఈ సంవత్సరం మొత్తంతో పాటు వచ్చే ఏడాది కూడా ఇదే
సినిమాలో నటించాల్సి ఉంటుంది' అని తెలిపారు.
2010లో లీడర్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రాణా ఇప్పటి వరకు
నాలుగు తెలుగు చిత్రాలు, రెండు హిందీ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో అతను
‘దమ్ మారో దమ్' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ పరిశ్రమ చాలా
పెద్ద పరిశ్రమ అని, అక్కడ అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని రాణా
చెప్పుకొచ్చారు.
నేను హిందీ సినిమాల వైపు మొగ్గు చూపడానికి కారణం బాలీవుడ్ పరిశ్రమ చాలా
పెద్ద కావడం వల్లనే అని రాణా స్పష్టం చేసారు. అక్కడ ఎన్నో కళా ప్రక్రియలు
ఉన్నాయని.... దమ్ మారో దమ్ చిత్రం అక్కడ పెద్ద మెయిన్ స్ట్రీమ్ చిత్రం
అయింది. కానీ అదే సినిమాను తెలుగులో తీస్తే అది స్మాల్ సిటీ బేస్డ్
సినిమాగా మిగులుతుంది. అందుకే బాలీవుడ్‌ను పెద్ద పరిశ్రమ అంటున్నాను...
అక్కడ ఎక్సపర్మెంట్స్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు
Read more at:
http://telugu.oneindia.in/movies/news/2013/04/bahubali-will-keep-me-busy-this-year-rana-114912.html
No comments:
Post a Comment