హైదరాబాద్ : ప్రభాస్, అనుష్క, రాణా ప్రధాన పాత్ర దారులుగా ప్రముఖ
దర్శకుడు రాజమౌళి ‘బహుబలి' అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్న
సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈచిత్రం ప్రస్తుతం కథా చర్చల
దశలో ఉంది. ఇటీవల రాజమౌళి స్టోరీ డిస్కర్సన్లో ప్రభాస్, అనుష్క, రాణా
తదితరుల కలిసి పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన పలు కీలక అంశాలను
చర్చించారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ వీక్షించవచ్చు.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘బహుబలి' చిత్రంలో అనుష్క హీరోయిన్‍గా, రాణా
విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి
శేష్ ‘బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా ఈగ ఫేం
సుదీప్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-anushka-rajamouli-baahubhali-story-sittings-115470.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-anushka-rajamouli-baahubhali-story-sittings-115470.html
చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం,
హార్స్ రైడింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని
దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ
ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను ఆర్కా మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు. ఈ
మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని
భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి పని చేస్తున్నా ప్రముఖ కళా
దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన
సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు
వెళ్లనుంది.
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-anushka-rajamouli-baahubhali-story-sittings-115470.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-anushka-rajamouli-baahubhali-story-sittings-115470.html
No comments:
Post a Comment