హైదరాబాద్ : ప్రభాస్ కి చిత్ర చిత్రానికి లేడీస్ ఫాలోయింగ్
పెరిగిపోతోంది. తాజాగా మిర్చి హిట్టవటంతో మరింతగా పెరిగిపోయారు. వాళ్లు
తనను ఎలా అభిమానిస్తారో ప్రబాస్ చెప్పుకొచ్చారు. తనకు చాలా మంది అమ్మాయిలు
లవ్ లెటర్స్ రాస్తారని అన్నాడు. అదో థ్రిల్లింగ్ అనుభవమని ఆయన
చెప్తున్నారు.
ప్రభాస్ మాటల్లోనే.. 'నా కెరీర్‌లో మొదటి చిత్రం 'ఈశ్వర్'. దాంతో మాస్
హీరోగా పేరొచ్చింది. కానీ, 'వర్షం' విడుదలయ్యాక అభిమానులు ఎక్కువయ్యారు.
వాళ్లలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ఆ చిత్రం విడుదలయిన తొలివారం నుంచే
ఉత్తరాలు రావడం మొదలైంది. వాటిలో తొంభైతొమ్మిది శాతం ప్రేమలేఖలే.
రకరకాలుగా తమ ప్రేమను వ్యక్తం చేసేవారు. అదో థ్రిల్లింగ్ అనుభవం. నాకు
తెలియనివాళ్లు నన్ను ఇంతగా అభిమానిస్తారా అనిపించింది.' అన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో ‘బహుబలి' చిత్రం చేస్తున్న సంగతి
తెలిసిందే. ఈచిత్రం అనంతరం బోయపాటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ‘బహుబలి' సినిమా
వివరాల్లోకి వెళితే... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్
పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని
వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్
ఇస్తున్నారు. . ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా
మీడియాపై రాఘవేంద్రరావు, శోభు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో
రూపొందిస్తోంది.
త్వరలో ప్రభాస్... అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, ఛే గువేరా
కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. మరి డైరక్టర్ ఎవరూ అంటే
ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణంరాజు గారే అని చెప్తున్నారు. ఒకప్పటి
యాంగ్రీయంగ్ మెన్ హీరో... కృష్ణంరాజు త్వరలో మెగాఫోన్ చేతపట్టబోతున్నారంటూ
చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యత
సంతరించుకుంది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియలాంటే కొద్ది రోజులు
ఆగాల్సిందే
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-about-his-love-letters-114834.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/prabhas-about-his-love-letters-114834.html
No comments:
Post a Comment