హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ' చిత్రంలో విలన్ పాత్రలో
సుదీప్ ఏ రేంజిలో నటించాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సుదీప్ నటనకు
తెలుగు ప్రేక్షకులు జై కొట్టారు. కాగా.. రాజమౌళి తన తాజా సినిమా ‘బహుబలి'లో
కూడా సుదీప్‌ను తీసుకున్నారు.
ఇటీవల వన్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించిన సుదీప్ ఇంటర్వ్యూలో
మాట్లాడుతూ.....‘బహుబలి' చిత్రంలో చిన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఆ పాత్ర వివరాలను మాత్రం సుదీప్ వెల్లడించలేదు. బిజీ షెడ్యూల్
ఉన్నప్పటికీ రాజమౌళి కోసమే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘బహుబలి' చిత్రంలో రాణా విలన్ పాత్రలో
నటిస్తున్నాడు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ ‘బహుబలి'
చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న
ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం, హార్స్ రైడింగ్ తదితర విభాగాల్లో శిక్షణ
ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో
ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా
మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు. ఈ మూవీకి ఎంఎం
కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో
రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని
చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా
పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే ఓ వండర్ గా ఈచిత్రాన్ని
రూపొందిస్తున్నారు.
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/i-am-doing-small-role-rajamouli-bahubali-sudeep-115332.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/i-am-doing-small-role-rajamouli-bahubali-sudeep-115332.html
No comments:
Post a Comment