హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో మాస్ డైరెక్టర్
బోయపాటితో సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్
నగర్ నుంచి. ఇంతకు ముందు ‘దమ్ము' చిత్రాన్ని తెరకెక్కించిన బోయపాటి ఆ
సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా రూపొందించలేక పోయారు.
ఆయన బాలయ్యతో ‘రూలర్' సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు
వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రొగ్రెస్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ....
ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఓ కథను రెడీ చేసుకుంటున్నాడట బోయపాటి. ఆయనతో
చేయడానికి ప్రభాస్ కూడా సుముఖంగానే ఉన్నాడని సమాచారం.
నవీన్ ఎర్నేని ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్
రాజమౌళి దర్శకత్వంలో ‘బహుబలి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం
అనంతరం బోయపాటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన
పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
‘బహుబలి' సినిమా వివరాల్లోకి వెళితే... ప్రభాస్ హీరోగా రూపొందుతున్న
ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య
కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో
ట్రైనింగ్ ఇస్తున్నారు. . ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఆర్కా మీడియాపై రాఘవేంద్రరావు, శోభు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో
రూపొందిస్తోంది.
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/boyapati-srinu-would-be-directing-prabhas-114751.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/boyapati-srinu-would-be-directing-prabhas-114751.html
No comments:
Post a Comment