మిర్చి | ప్రభాస్
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి' చిత్రం వరల్డ్
వైడ్ గా మొత్తం 238 సెంటర్లలో గ్రాండ్ గా 50 రోజులు పూర్తి చేసుకుని
ప్రభాస్ కెరీర్లోని విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఏ ఏరియలో
ఎన్సి సెంటర్లలలో ప్రదర్శితం అయిందనే వివరాలు పరిశీలిద్దాం.
నైజాం : 81 సెంటర్లు
సీడెడ్ : 38 సెంటర్లు
వైజాగ్ : 22 సెంటర్లు
వెస్ట్ : 11 సెంటర్లు
ఈస్ట్ : 16 సెంటర్లు
కృష్ణ : 26 సెంటర్లు
గుంటూరు : 19 సెంటర్లు
నెల్లూరు : 15 సెంటర్లు
బెంగుళూరు : 6 సెంటర్లు
చెన్నై : 2 సెంటర్లు
ఓవర్సీస్(అమెరికా) : 2 సెంటర్లు
అమెరికాలో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా మిర్చి
రికార్డుల కెక్కింది. ‘మిర్చి' చిత్రం ద్వారా కొరటాల శివ దర్శకుడిగా పరిచయం
అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా,
యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా
‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి,
సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:
దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు:
వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కొరటాల శివ.
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/03/mirchi-50-days-238-centers-114257.html
Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/03/mirchi-50-days-238-centers-114257.html
No comments:
Post a Comment