Tuesday, 23 July 2013

‘బాహుబలి’ గురించి సుదీప్ ట్వీట్

 హైదరాబాద్ : 

                    ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘ఈగ' లో కన్నడ నటుడు సుదీప్ కనబరిచిన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ మెప్పించిన విషయం తెలిసిందే. సుదీప్ లేకపోతే ‘ఈగ'ను ఊహించుకోవడం కష్టమే అనేంతగా నటనను ప్రదర్శించి రాజమౌళిని మెప్పించిన సుదీప్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.

                   ప్రభాస్ హీరోగా రాజమౌళి ‘బాహుబలి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గెస్ట్ రోల్ లో ఓ కథలో ఓ కీలకమైన మార్పుని తెచ్చే పాత్రను సుదీప్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చాలా ఎక్సైట్ మెంట్ తో సుదీప్ ఉన్నారు. తన ఆనందాన్ని సుదీప్ తన ట్విట్టర్ పేజీ లో ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
 

      ‘బాహుబలి’ గురించి సుదీప్ ట్వీట్

                     సుదీప్ ట్వీట్ చేస్తూ..." బాహుబలి షూటింగ్ ఖచ్చితంగా ఓ మంచి ఎక్సపీరియన్స్ , చాలా అద్బుతమైన సెట్స్, మంచి టీమ్ , రాజమౌళి గారితో మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలతో ట్వీట్ చేస్తాను ." అన్నారు.

                      అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రానాతో పాటు ‘పంజా' ఫేమ్ అడివి శేష్ నటించనున్నాడు. వీరితో పాటు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సుదీప్ నటించనున్నాడని, ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా చాలా ప్రాధాన్యత వుంటుందని చిత్ర వర్గాల సమాచారం.

                       ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. 

                         ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

No comments:

Post a Comment