హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా బడ్జెట్ ఎంత అనేది ప్రాజెక్టు ప్రారంభమైనప్పటినుంచి చర్చలో ఉన్న విషయమే. ఈ నేఫద్యంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రూ. 125 కోట్లతో రూపొందుతోందని పేరుపొదిన బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌కు చెందిన బాలీవుడ్ హంగామా డాట్ కామ్ రిపోర్ట్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇప్పటివరకూ రూపొందిన భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధిక వ్యయభరిత చిత్రంగా 'బాహుబలి'ని ఆ పోర్టల్ పేర్కొంది. అయితే ఇది కేవలం ఒక్క తెలుగు వెర్షన్‌కు మాత్రమే సంబంధించిన బడ్జెట్ కాదు. ఈ సినిమా మూడు భాషల్లో - తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో - ఏక కాలంలో నిర్మాణమవుతోంది.
ఎనిమిదో శతాబ్దం నాటి రాచరిక వ్యవస్థ నేపథ్యంలో రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం సాంకేతికంగా భారతీయ సినిమాని మరో స్థాయికి తీసుకుపోతుందనీ, ఇప్పటివరకూ చూడని అద్భుతమైన సెట్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయనీ సమాచారం. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రానా నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.
'బాహుబలి'ని ఐమాక్స్ కెమెరాతో చిత్రించబోతున్నారనే విషయాన్ని దర్శకుడు ఖండించారు. ఈ సినిమాను ఆరీ అలెక్సా ఎక్స్‌టీ అనే కెమెరాతో తెరకెక్కిస్తామని తెలిపారు. అలాగే చిత్రీకరణకు అయ్యే వ్యయం గురించి వస్తున్న వార్తల్నీ తోసిపుచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో 'బాహుబలి' రూపొందుతుంది. చిత్రాన్ని హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తారు. చిత్రం గురించి శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "దాదాపు ఏడాది పాటు చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత జూలై 6న 'బాహుబలి' షూటింగ్ మొదలు పెట్టాం..ఎంతో ఉద్వేగంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి అన్ని విధాలా సమాయత్తమయ్యారు'' అని తెలిపారు.
English summary:
Tarun Aadarsh's says...S.S. Rajamouli, the celebrated director of Makkhi, has declared production that the budget for his next movie to be made in three languages stands at Rs. 125 crore. Effectively making the film titled Bahubali, the most expensive Indian film ever made. Scheduled to go on floor in the next few months, Bahubali is said to be a period film set in eighth century AD. The film will showcase never seen before spectacular sets and special effects taking it up to the next level.
No comments:
Post a Comment