Sunday 7 April 2013

రాజమౌళి-ప్రభాస్ ‘బహుబలి’లో పంజా విలన్


Adivi Sesh Rajamouli Bahubali హైదరాబాద్: పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం, హార్స్ రైడింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ప్రారంభించారు. తాజాగా అడవిశేష్ కూడా ఈ ట్రైనింగులో జాయిన్ అయ్యాడు. మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా బహుబలి. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రీప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈచిత్రంలో ప్రభాస్-రాణా మధ్య మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరితో పాటు సత్యరాజ్, అనుష్క. అడవి శేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 80 కోట్ల వ్యయంతో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా మీడియా బేనర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సమర్పకులు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే ఓ వండర్ గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/04/adivi-sesh-rajamouli-bahubali-114789.html

No comments:

Post a Comment